02/07/2024
*టారిఫ్ లు పెంచినా జియోనే చౌక*
• 20% తక్కువ ధర గల ప్రీపెయిడ్ ప్లాన్‌లతో జియో అత్యంత సరసమైనదిగా కొనసాగుతోంది
• పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో కూడా కంటే 29% తక్కువ
• రూ. 199 తో ఎంట్రీ లెవల్ ప్లాన్; రూ. 91 తో జియో ఫోన్, జియో భారత్ ప్లాన్
జియో తో పాటు ఎయిర్టెల్, వొడా ఐడియా లు కూడా తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. అయితే వీటి పెంపు తర్వాత కూడా జియో ప్లాన్ల ధరలు ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం.
గత వారం మొదట జియో 10 నుంచి 21 శాతం వరకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. ఆ తర్వాత ఎయిర్టెల్ కూడా 25 శాతం వరకు ధరలను పెంచింది. ఈ రేట్లు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఛార్జీలు పెంచిన తర్వాత కూడా జియో ప్లాన్లే చౌక ధరకు లభిస్తున్నాయి.
ఉదాహరణకు జియో రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ ప్లాన్ ధర రూ. 249 గా ఉంది. అదే ఎయిర్టెల్ లో అయితే రూ. 299 గా ఉంది. జియో యూజర్లు ఇప్పటికీ 20 శాతం తక్కువ ధరకే ప్లాన్ పొంది రూ. 50 ఆదా చేసుకోవచ్చు.
రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియోలో రూ. 299 గా ఉండగా ఎయిర్టెల్ లో అయితే రూ. 349 గా ఉంది. అంటే జియో యూజర్లు 17 శాతం తక్కువ ధరతో రూ. 50 ఆదా చేసుకోవచ్చు.
రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియో రూ. 349 కి అందిస్తుండగా, ఎయిర్టెల్ లో ఇదే ప్లాన్ ధర రూ. 379 గా ఉంది. జియో యూజర్లు 9 శాతం తక్కువ ధరతో రూ. 30 ఆదా చేసుకోవచ్చు.
మరో వైపు, మూడు నెలల ప్లాన్ల విషయానికి వస్తే.. 6 జీబీ డెటా, అన్ లిమిటెడ్ కాలింగ్ మూడు నెలల ప్లాన్ ధర జియోలో రూ. 479 గా ఉంది. అదే ఎయిర్టెల్ లో అయితే 6 శాతం లేదా రూ. 30 ఎక్కువ ధరతో రూ. 509 గా ఉంది.
రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ ధర జియోలో రూ. 799 గా ఉంది. అదే ఎయిర్టెల్ అయితే 8 శాతం లేదా రూ. 60 ఎక్కువ ధరతో రూ. 859 గాఉంది.
ఇక ఏడాది ప్లాన్ల పరంగా.. 24 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఒక ఏడాది పొందేందుకు జియో రూ. 1,899 ప్లాన్ ను ఆఫర్ చేస్తోంది. అదే ఎయిర్టెల్ అయితే 5 శాతం లేదా రూ. 100 ఎక్కువ ధరతో రూ. 1,999 కు ఈ ప్లాన్ ను అందిస్తోంది.