Vasavi Classifieds

Vasavi Classifieds Vasavi Classifieds is a Advertisement Web Portal for the benefit of Common to Corporate people who wish to promote their skills, business and profession.

27/10/2024

కూర్చుండ మా యింట కురిచీలు లేవు, ప్రణయాంకమే సిద్ధపరుచుచుంటి ,
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు , నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి, పూజకు మావిట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి,
నైవేద్యము ఇడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతి కందియనుంటి,
లోటు రానీయ నున్నంతలోనా నీకు రమ్ము దయసేయు మాత్మ పీఠమ్ము పైకి,
అమృత ఝరి చిందు నీ పాదాంకముల యందు కోటి స్వర్గాలు మొలిపించు కొనుచు తండ్రీ

25/10/2024

ఒక సన్యాసి గుర్రం మీద వెళుతున్నాడు. ఒక దొంగ ఆ గుర్రాన్ని కాజేయాలని అనుకున్నాడు. కుంటుకుంటూ వెళ్ళి సన్యాసిని సాయం అడిగాడు. గుర్రం ఎక్కించుకున్నాడు సన్యాసి. కొంత దూరం వెళ్ళిన తరువాత సన్యాసిని తోసేసి నేను నిన్ను మోసం చేసి నీ గుర్రాన్ని కాజేయటానికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు సన్యాసి గుర్రాన్ని తీసుకెళ్ళు నేనేమీ అనుకోను కాని మోసం చేసి తీసుకొచ్చాను అని ఎవరికీ చెప్పకు. ఎందుకంటే దేశంలో సాయం చేసే మనుషులే ఉండరు.

అదిగో రామయ్యా, ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరీ, శబరీ వస్తున్నానంటున్నవి. నడవలేని వెర్రి శబరి నీకోసమే, నీ కోసమే నడచి నడ...
24/10/2024

అదిగో రామయ్యా, ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరీ, శబరీ వస్తున్నానంటున్నవి. నడవలేని వెర్రి శబరి నీకోసమే, నీ కోసమే నడచి నడచి నడచి... అసలే ఆనని చూపు, ఆ పై ఈ కన్నీరు తీరా దరిచేరిన నా చూపు కానదయ్యయ్యో..
ఎంతటి ఎదురు చూపు, ఎంతటి ఆర్ద్రత, ఎంతటి ప్రేమ బాల్యం నుండి నడవలేని వృద్ధాప్యం వరకూ రాముని కోసం చూసిన ఎదురు చూపు.
భక్తి అంటే తనను తాను సమర్పించుకోవటం అంతే కాని గుట్టలకొద్దీ పూలు, ప్లేట్ల నిండా పండ్లు, ఆలయమంతా నోట్లు రోడ్లంతా గంతులు.. మనసు ద్రవించాలు, పరవశించాలి, కనులలో ఆర్ద్రత నిండాలి. గుండెలనిండా ఆ రూపం నిండిపోవాలి.
ఏంటో పొద్దున్నే ఇలా మనసు లాగేస్తుంది.

28/06/2024

ఈ మధ్య మర్యాద కోసం పిలిచే పిలుపులలో ఆత్మీయత కన్నా వారి దర్భం చూపించుకునే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకనే ఓ సోదరి చెప్పిన మాట నాకు బాగా నచ్చింది.
పిలిస్తే ఒక నమస్కారం. పిలవక పోతే రెండు నమస్కారాలు.
పిలవక పోతే నేను ప్రెపేర్ కానక్కరల్లేదు కదా అందుకు రెండు నమస్కారాలు. పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక నమస్కారం.
బాగుంది కదా మిత్రాస్.
ఎవరి ఆత్మాభిమానం వారికుంటుంది. ఎవరికి ఎవరూ తక్కువ కాదు.
సర్వేజనా సుఖినో భవంతు.

21/06/2024

అభ్యాగతః స్వయం విష్ణుః...
అంటే వచ్చెడి వాడు స్వయానా శ్రీమన్నారాయణుడు. ఆయనే వచ్చి నన్ను 3 అడుగులు అర్థిస్థున్నాడు. ప్రాణాలే ఇస్తాను కదా అని బలి చక్రవర్తి అన్నాడు. చెప్పేది ఏమిటంటే ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడి కంటే గొప్పవాడు కనుక ఇవ్వటమే గొప్ప సంస్కారాన్ని మరువకండి అని.
శుభం భూయాత్. శుభోదయం.

ఈ రోజు అమెరికాకు చెందిన మిత్రులు శ్రీ రావులపర్తి పవన్ కుమారి సకుటుంబ సమేతంగా మన వాసవీ ఫౌండేషన్ కార్యాలయానికి విచ్చేసి మన...
20/06/2024

ఈ రోజు అమెరికాకు చెందిన మిత్రులు శ్రీ రావులపర్తి పవన్ కుమారి సకుటుంబ సమేతంగా మన వాసవీ ఫౌండేషన్ కార్యాలయానికి విచ్చేసి మన ఫౌండేషన్ కు తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేసారు. అలాగే వారు అమెరికాలో మన వాసవీ ఫౌండేషన్ ప్రతినిథిగా వుండటానికి అంగీకరించినందున చిరు సన్మానం.

17/06/2024

నాకో చెడ్డ అలవాటుంది. నిజంగానే అది మంచిదో చెడ్డదో మీరే చెప్పండి. అదేంటంటే నేను మా చెల్లిళ్ళనుండి, కూతుర్లనుండి అడిగి మరీ ఏదో ఒకటి తెప్పించుకుంటాను. మా ఆవిడ తిడుతూ వుంటుంది. అది మంచి పద్దతి కాదు అని. నిజానికి నేను కొనుక్కోలేక కాదు అడిగేది. నాకు మావాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలి. అదొక ఋణానుబంధం కలకాలం నిలవాలని అడుగుతుంటాను.
ఓ సారి అల్లురామలింగయ్య గారు విమానంలో ప్రయాణిస్తుంటే హోస్టస్ చాక్లెట్లను ఇచ్చింది. మన సార్ గుప్పిటనిండా తీసుకున్నాడు. అది చూసి ప్రక్క ప్రయాణికుడు ఏంటో ఇంత ఆశ చాక్లెట్ల దగ్గర కూడా అని అనేసాడు. దానికి అల్లుగారు నవ్వుతూ నేను చాక్లెట్ల ఫ్యాక్టరీనే పెట్టగలను. కాని నేను ఇంటికి వెళ్ళగానే మా మనవళ్ళు తాతా విమానం చాక్లెట్లు ఏవీ అని అడుగుతారు. అందుకోసమని తీసుకున్నా. కొనలేక కాదు సార్ అని బదులిచ్చాడు.
ఇది కూడా అంతే. బంధాలు పెరగాలంటే ఋణాను బంధం ఉండాల్సిందే. ఏమంటారు మిత్రాస్....

13/06/2024

ఏదో చెప్పి, ఏదో సర్థేస్తే ఎవరూ నమ్మరు. ఒకవేళ నమ్మినా తాత్కాలికమే. కొంతమంది అన్నీ తెలిసినా తెలియనట్లు, పట్టించుకోనట్లు వుంటారు. వీరితోనే అసలైన ప్రమాదం. ఉన్నట్లుండి చాలా డ్రాస్టిక్ డెసిషన్ తీసేసుకుంటారు. మళ్ళీ మార్చుకోవటాలు ఉండవు. వీరికి బంధాలు, అనుబంధాలు, తొక్క తోటకూరా ఏమీ వుండవు. ఎదుటి వారి పనులు నచ్చలేదా కట్ చేసి పారేస్తారు. ఒక్క విషయం మీలో చాలామంది ఒట్టు, ప్రామీస్, చేతిలో చేయి వేయించుకోవటాలు నమ్ముతారా. అది బ్లాక్ మెయిల్ చేయటమే అని భావించి దొంగ ప్రామీసులు చేస్తారా. లేక అస్సలు చేయరా. ఒకవేళ చేసినా పాటించరా.

13/06/2024

పెండ్లి అయిన కొత్తల్లో మా ఆవిడతో గొప్పలు చెబుతుంటే చాటుగా విన్న 60 ఏళ్ళ అత్తగారు నేను వినేటట్లుగా పహలే కరో పీచే కహో అన్నది. దీనమ్మ జీవితం పెళ్లై 40 ఏళ్లు అవుతున్నా రోజుకో సారి ఇంకా గుర్తుకు వస్తుంది. కొడితే అలా కొట్టాలి. కదా....

07/06/2024

మిత్రాస్ మరో చిన్న ప్రశ్న
హరి మధ్యమ అంటే ఏంటి ఎవరిని అంటారో తెలుసా... కొంచెం చెబుదురూ గూగుల్ లో కూడా వెతికాను కనపడలేదు. మీకేమైనా తెలుసా...

05/06/2024

ఏడు మల్లెల ఎత్తు అంటారు కదా అందమైన సుకుమారిని అసలు ఏడు మల్లెల ఏత్తు అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా....

Address

Tirupathi
517507

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 1pm

Telephone

+919160053535

Alerts

Be the first to know and let us send you an email when Vasavi Classifieds posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vasavi Classifieds:

Share