AP Fiber Podili

AP Fiber Podili Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AP Fiber Podili, Telecommunication Company, Podili, Podile.

25/01/2025
నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాల‌ని జీవి రెడ్డి గారు ఆకాంక్...
01/01/2025

నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాల‌ని జీవి రెడ్డి గారు ఆకాంక్షించారు.

పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు.

గౌరవనియులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినటువంటి ఫైబర్ నెట్వర్క్ సంస్థ రాబోయే రోజుల్లో 50 లక్షల కనెక్టివిటీనీ పెంచే దిశగా అడుగులు వేస్తూ ఈ కొత్త సంవత్సరం పునాది కావాల‌న్నారు. నిరంతరం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవ దేవుడిని కోరుకుంటూ, 2025 సంవ‌త్స‌రం ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా స‌మృద్ధిగా సంపద, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, అలానే రాష్ట్ర MSO, LMO మరియు ఫైబర్ నెట్ వినియోగ దారులకు మరియు ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇట్లు...
ఏపి ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవి రెడ్డి

26/12/2024













పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే...
19/12/2024

పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

గురువారం స్థానిక ఒంగోలు పట్టణం సీవియన్ రీడింగ్ రూం నందు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ ఉమ్మడి ప్రకాశం జిల్లా APSFL కేబుల్ ఆపరేటర్లతో సమావేశం
సందర్భంగా పేద, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్వర్క్, కేబుల్ కనెక్షన్లు, ల్యాండ్ ఫోన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుంది ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రానున్న రోజుల్లో 50 లక్షల ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నాము. జియో , ఎయిర్టెల్ నెట్వర్కుల కంటే కూడా ఫైబర్ నెట్వర్క్ ద్వారా నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందించేల కృషి చేస్తున్నాము. నెట్వర్క్ సమస్యలు, సెటప్ బాక్స్ సమస్యలు తలెత్తితే త్వరితగతిన పరిష్కరించేలా సర్వీస్ సెంటర్లని ఏర్పాటు చేసి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నము. అతి తక్కువ ధరకే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నిటిని కూడా ఫైబర్ నెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని మాట్లాడటం జరిగింది. మీటింగ్ ముగిసిన తరువాత ప్రకాశం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసు (DHQ)సందర్శించి APSFL సిబ్బంది తో జిల్లాలో సమస్యల గురించి చర్చించి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వటం జరిగింది.
----------------------------
- జీవీ రెడ్డి, ఛైర్మన్,
ఎపి ఫైబర్ నెట్ లిమిటెడ్

ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువ రేట్లకే అందించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎపి ‌లో ఫైబర్ ...
19/12/2024

ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువ రేట్లకే అందించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎపి ‌లో ఫైబర్ నెట్ ను ప్రారంభించారు, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఉన్న ఫైబర్ నెట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఫైబర్ నెట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాటి ఫలాలను ప్రజలు, ఉద్యోగులు చూశారు.. 2019 నాటికి పది లక్షల కనెక్షన్లు ఉండగా 2024 నాటికి కేవలం ఐదు లక్షల కనెక్షన్లు కు పడిపోయాయి. పది రెట్లు పెరగాల్సిన కనెక్షన్లు సగానికి తగ్గి దివాళా అంచుకి సంస్థ ను తెచ్చారు. ఇంతమంది ఉన్నా ఎందుకు కనెక్షన్లు తగ్గాయో అర్థం కావడం లేదు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగించి పూర్తి పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తాము.. కేబుల్ ఆపరేటర్ లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ ను మరింత అభివృద్ధి చేస్తాము. స్టేట్ ఫైబర్ నెట్ కనెక్షన్లను రెండేళ్ల‌లొ 50 లక్షలకు పెంచుతాము. మరియు అనేక మైన విషయాలు మాట్లాడటం జరిగింది.


జీ.వీ. రెడ్డి, ఛైర్మన్,
ఎపి ఫైబర్ నెట్ లిమిటెడ్

ఫైబర్ నెట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచన
- చైర్మన్ జీవి రెడ్డి













ఫైబర్ నెట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచన                                   - చైర్మన్ జీవి రెడ్డి రాష్ట్...
05/12/2024

ఫైబర్ నెట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచన
- చైర్మన్ జీవి రెడ్డి

రాష్ట్ర ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జీవి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ను వెలగపూడి సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు..
ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఫైబర్ నెట్ లో జరిగిన, జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలిపారు.. పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఏపీ ఫైబర్ నెట్ సేవలను రాష్ట్రంలో విస్తృత పరచాలని సూచించారన్నారు. అలానే కనెక్టివిటీని పెంచుతూ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని సూచించారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించాలని దానికి ప్రణాళిక రూపొందించాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారన్నారు..













Address

Podili
Podile
523240

Alerts

Be the first to know and let us send you an email when AP Fiber Podili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share