Ananya Xerox & Net Center

Ananya Xerox & Net Center AP Online, LIC Premium Point, Digital Color Xerox, Telugu English Hindi DTP Works, ID Cards, Duplicate PVC Cards etc.,

01/04/2020
24/03/2020

కరోనా వచ్చిందని ఇంట్లో అందరూ ఉన్నారని హైరానా పడిపోవద్దు.

కూరగాయలు లేవనీ, దొరకటం లేదని టెన్షన్ పడొద్దు .

ఒక్కసారి మీ చిన్నప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకోండి .చక్కగా కందిపప్పు వేయించి పప్పు వండి ,చారు పెట్టండి. లేకపోతే పప్పు పులుసు, పప్పు చారు చెయ్యండి .రెండు పూటల కీ సరిపోతుంది .బంగాళాదుంపలు వేపుడు చేస్తే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. లేకపోతే రెండు ఒడియాలు వేయించండి చాలు.

పెరుగు ని మజ్జిగ చేయండి .రెండు రోజులు సరిపోయేటట్టు ఉంటుంది. మొదటిరోజు అన్నంలో కలుపుకుని తింటే, రెండో రోజు మెంతి మజ్జిగ,లేదా మజ్జిగ చారు చేసుకుని కంది పచ్చడి గాని పెసర పచ్చడి గాని చేస్తే అద్భుతః !

ఇంకొకరోజు సుబ్బరంగా చింతపండు పులిహార చేసి కాస్త గోధుమ రవ్వతో హల్వా చేస్తే సరి !

ఇంకొకరోజు శెనగలు గాని ,బొబ్బర్లు గాని నానబెట్టుకుని కూర చేసుకుని, చారు పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం ఆలోచిస్తే బోల్డన్ని వంటకాలు!

కూరగాయల కోసం ఎగబడి పోకుండా, ఒక వారం నుంచి పది రోజుల పాటు హ్యాపీగా ఉండొచ్చు .మా పిల్లలు తినరు ,మా ఆయన తినడు అని అనుకుంటూ మార్కెట్లోకి ఎగబడి లేనిపోని తంటాలు తెచ్చుకుని బాధపడే బదులు ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పి ఇంట్లో ఉండే ఈ సరుకుల తోటి వంట ముగించుకో వచ్చు.

మనం ఇలా చేస్తే ఏరోజుకారోజు కొనుక్కోనే పేదవాళ్ళకి సరుకులు దొరికే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇంకా పూర్తిగా నెలాఖరు అవ్వలేదు కదా !

అందుకని మధ్యతరగతి వాళ్ళం, పిల్లలకి నచ్చ చెపుతూ ,పెద్దవాళ్ళకి పాత, చిన్నప్పటి రోజులు గుర్తుకు తెస్తూ ఇలాంటి వంటలు చేద్దాం. అసలైన సంగతి మర్చిపోయా నండోయ్ మన తెలుగు మహిళ చేతిలో ఎప్పుడూ ఉండే ఎవర్ గ్రీన్ వంటలు, కంది పొడి ,కరివేపాకు పొడి, నువ్వుల పొడి ఇవన్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది .పిల్లలకి కొత్త రుచులు చెప్పండి. పెద్దలకి మరిచిపోయిన రుచులు గుర్తుకు తెండి .

వారం రోజుల పాటు ఇంట్లో నుంచి కదలక్కర్లేదు .తరవాత ఎలాగో కొంచెం ఉధృతం తగ్గుతుంది కాబట్టి బయటకు వెళ్లి మనకి కావలసనవి ఒక వారం పది రోజులకు సరిపడా తెచ్చుకోవచ్చు.

ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు కదా !మా పిల్లలకి ఇవి ఇష్టం ఉండవు, ఎప్పుడూ తినలేదు ,నాకు చేత కాదు, ఈ కబుర్లు చెప్పే బదులు పిల్లలకి నచ్చజెప్పి తినిపించడంలో ఉన్న మజా అందరం అనుభవిద్దాం !

ఒక వారం రోజులు కూరగాయలు పళ్ళు తినక పోయినంత మాత్రాన ఏమీ జరగదు. కాబట్టి ఇవి ఆలోచించి ఆచరించి చూడండి.

ఈ కరోనా ప్రపంచాగ్ని లో నేను సైతం ఓక నీటి బొట్టుని వేస్తూ, నమస్కారాలతో .....

27/11/2018

కోడిగుడ్డు కూరొండితే సకంగుడ్డే ఏసీవోరు మనకి ఆరోజులు గేపకవున్నాయా?

నెయ్యికాసేక ఆఖరుని మూగిట్లో వుండే గోదారిలో కాతంత పందారేసి ఏడిసేసినప్పుడు నల్లగా వున్నాదాన్ని వుండలుగా సేసి తినీవోల్లుం.,
దానిముందు డైరీమిల్కులేమూలకి.., గేపకవుందా?

సెకండేండు టెస్టుబుక్సు సగంరేటుకి కొంటం కోసం మన సీనియర్ల సుట్టూ తిరిగిన రోజులు గేపకవున్నాయా.!

ఇంటికొచ్చిన సుట్టాల్ని బస్సెక్కిత్తే ఆల్లిచ్చే పదిపైసలు పావలా కోసం రెండేసి గంటలు ఎయిటింగ్ సేసిన రోజులు గేపకవున్నాయా?

అన్నాలు తినీదప్పుడు కోడిగుడ్డు కంచం కోసం దెబ్బలాడుకున్నా రోజులు గేపకవున్నాయా?

పెన్సిలెప్పుడూ సగంముక్కే వాడిన ఆరోజులు గేపకవున్నాయా?

పదోతరగతి పేసయ్యీదాక కూడా ఫేంటు మొకం తెలని ఆరోజులు గేపకవున్నాయా?

ఆగస్టుపదేనుకో, నవంబరు పద్నాలుక్కో బల్లోపిల్లలందరిని టిక్కెట్టుకి ఇద్దర్ని చొప్పున పంపినప్పుడు తప్ప మల్లీ సినిమాకే పంపని ఆరోజులు గేపకవున్నాయా?

మన స్కూలు బేగ్గు మడతమంచం గుడ్డతోగాని,
పిండిసంచితోగాని కుట్టించినియ్యే వాడే ఆరోజులు గేపకవున్నాయా?

ఎప్పుడికైనా యీదలోరి బుజ్జిగేడిలాగ సీవండి పెట్టిలో పుస్తకాలట్టికెల్లాలని కలలుగన్నా ఆరోజులు గేపకవున్నాయా?

ఇంటికొచ్చిన సుట్టాలకి డ్రింకుబుడ్డి తెచ్చినప్పుడు ఆల్లుసగంతాగి, సగంవదిలేత్తే ఆల్లెప్పుడెలిపోతారా, ఆమిగిలిన డ్రింకు తాగేద్దావని ఎదురు సూసిన రోజులు గేపకవున్నాయా?

జొరవొత్తే బావున్ను పాలు,రొట్టి ఇత్తారని ఎదురు సూసిన ఆరోజులు గేపకవున్నాయా?

అయ్యేవన్నా మరిసిపోయే రోజులా?
తలసుకుని మురిసిపోయే రోజులు.,!

మీగ్గేపకవున్నా గేపకాలు కామెంట్లలో ఎట్టండి.,

వీటిగురించి తెలియని వయసువారు మీరైతే మీఅమ్మా,నాన్నల నడగండి., వాల్లుకూడా ఆరోజుల్లో కెల్లి మీకు అన్నీ చెబుతారు.,

31/07/2018

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఫ్లాట్ ఫారం లు మారాయి..

హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఫ్లాట్ ఫారంలలో మార్పులు చేసారు అధికారులు. ఈ బస్ స్టాండ్ నుండి రోజు దేశం లోని అన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సుల ప్లాట్‌ఫారంలను మార్చడం జరిగింది. ఈ విషయాన్నీ అధికారాలు ప్రయాణికులకు ముందుగానే తెలియజేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏయే బస్సులు ఆగుతాయనే అంశంపై ప్లాట్‌ఫారం నంబర్లు, ఆగే బస్సుల వివరాలతో కూడిన ఓ జాబితాను మీడియా కు తెలిపారు. ఈ కింది జాబితాను బట్టి మీరు తెలుసుకోవచ్చు.

* 1 నుంచి 5 ప్లాట్‌ఫారం వరకు: గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల, అమరావతి, ఐరావత్‌ బస్సులన్నీ నిలపనున్నారు.
* 6 నుంచి 7 వరకు: బెంగళూరు వెళ్లే టీఎస్‌ఆర్టీసీ బస్సులు
* 8వ ప్లాట్‌ఫారం: బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు
* 9వ ప్లాట్‌ఫారం: అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు
* 10 నుంచి 11 వరకు: ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు
* 12వ ప్లాట్‌ఫారం: సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు
* 13వ ప్లాట్‌ఫారం: కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్‌ బస్సులు
* 14 నుంచి 15 వరకు: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు
* 16 నుంచి 17 వరకు: గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు
* 18 నుంచి 22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్‌
* 23వ ప్లాట్‌ఫారం: శ్రీశైలం వెళ్లే బస్సులు
* 24 నుంచి 25 వరకు: అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
* 36వ ప్లాట్‌ఫారం: రాయ్‌చూర్‌ బస్సులు
* 27 నుంచి 31 వరకు: మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ
* 32 నుంచి 34 వరకు: నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌
* 35 నుంచి 36 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 37 నుంచి 38 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 39వ ప్లాట్‌ఫారం: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 40వ ప్లాట్‌ఫారం : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 41 నుంచి 42 వరకు: గద్వాల్‌, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 43 నుంచి 45 వరకు: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 46 నుంచి 47 వరకు: మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ వెళ్లే బస్సులు
* 48 నుంచి 52 వరకు: జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరాడ్‌, షోలాపూర్‌, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 53 నుంచి 55 వరకు : సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్‌, మంచిర్యాల, అసీఫాబాద్‌ బస్సులు
* 56 నుంచి 58 వరకు: నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగ్‌పూర్‌, అమరావతి బస్సులు
* 59 నుంచి 61 వరకు: మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు
* 62వ ప్లాట్‌ఫారం: దేవరకొండ
* 63 నుంచి 65 వరకు: పరిగి, వికారాబాద్‌, తాండూరు బస్సులు
* 66 నుంచి 75 వరకు: ఎలైటింగ్‌ పాయింట్లు
* 76 నుంచి 79 వరకు: సిటీ సర్వీస్‌ బస్సులు

21/08/2017

ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసా?!!

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక నిపుణులు అన్ని విషయాల్లోనూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక మొబైల్ విషయానికి వస్తే.. ఏ వ్య‌క్తి అయినా త‌న‌ రాశి ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ను వాడితే దాంతో చాలా మంచి జ‌రుగుతుంద‌ట‌. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌.
మ‌రి 12 రాశుల‌ను బ‌ట్టి ఏయే రాశి వారు ఏయే స్మార్ట్‌ఫోన్ల‌ను వాడ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మేష రాశి
ఈ రాశి వారికి ఓపిక, స‌హ‌నం త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే ఏ ప‌ని అయినా చాలా వేగంగా జ‌ర‌గాల‌ని కోరుకుంటారు. క‌నుక వీరు 6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ల‌ను వాడితే మంచిది. తాజాగా విడుద‌లైన వ‌న్ ప్ల‌స్ 5 స్మార్ట్‌ఫోన్ వీరికి బెస్ట్ చాయిస్‌.

2. వృష‌భం
వీరు ప్ర‌కృతిని, అందాల‌ను ఎక్కువ‌గా ప్రేమిస్తారు. వీరు ఏ ప‌నికోస‌మైనా చ‌క్క‌గా ప్ర‌ణాళిక‌లు వేస్తారు. ఉన్న‌త ల‌క్ష్యాల‌ను సాధించాల‌నే ఆశయం వీరిలో బ‌లంగా ఉంటుంది. క‌నుక వీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 వంటి హై ఎండ్ ఫోన్ కొనుక్కుంటే మంచిది.

3. మిథునం
వీరు త‌మ‌లో ఉన్న ఎలాంటి భావాల‌నైనా చాలా సృజ‌నాత్మ‌కంగా ఇత‌రుల‌తో చెప్ప‌గ‌ల‌రు. వీరికి గుంపులో ఒక‌రిగా క‌న్నా సింగిల్‌గా ఉండ‌డ‌మే ఇష్టం. క‌నుక వీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్ ఫోన్‌ను తీసుకుంటే బెట‌ర్‌.

4. క‌ర్కాట‌కం
వీరు ఎక్క‌డికెళ్లినా, ఏ ప‌ని చేసినా అందులో కంఫ‌ర్ట్ కోరుకుంటారు. అంతేకానీ అన‌వ‌స‌రంగా ఆందోళ‌న‌ల‌కు గురికారు, క‌న్‌ఫ్యూజ్ అవ‌రు. నిర్దిష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో ఉంటారు. క‌నుక వీరు గూగుల్ పిక్స‌ల్ ఫోన్‌ను కొనుక్కుంటే బాగుంటుంది.

5. సింహం
వీరికి కొత్త విష‌యాల‌ను నేర్చుకోవాల‌నే కుతూహ‌లం ఎక్కువగా ఉంటుంది. అంద‌రిక‌న్నా అప్‌డేటెడ్‌గా ఉండాల‌ని వీరు ఆలోచిస్తారు. విలాస‌వంతంగా ఉండాల‌ని కోరుకుంటారు. క‌నుక వీరు హెచ్‌టీసీ యూ11 ఫోన్‌ను కొనుక్కోవాలి.

6. క‌న్య
ఎక్కడికెళ్లినా, ఎంద‌రిలో ఉన్నా వీరు సింపుల్‌గా ఉండాల‌ని కోరుకుంటారు. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌కు పోరు. సాధార‌ణ వ్య‌క్తిలా జీవించాల‌ని అనుకుంటారు. క‌నుక వీరు యావ‌రేజ్ మోడ‌ల్ అయిన మోటో జ‌డ్ ప్లే ఫోన్‌ను కొనుగోలు చేస్తే మంచిది.

7. తుల‌
వీరికి సంగీతం విన‌డం, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అంటే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీరు ఆ స్థాయికి స‌రిపోయే హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్‌ను కొంటే మంచిది.

8. వృశ్చికం
వీరికి న‌లుగురిలో ప్ర‌త్యేకంగా ఉండ‌డం అంటే ఇష్టం. అందుకోస‌మే ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తుంటారు. అంద‌రిలా ఉండాల‌ని కోరుకోరు. క‌నుక వీరికి భిన్న‌మైన ఫోన్ అయిన బ్లాక్‌బెర్రీ పాస్ పోర్ట్ ఫోన్ క‌రెక్ట్ గా సెట్ అవుతుంది.

9. ధ‌నుస్సు
వీరు ఎల్ల‌ప్పుడూ సృజ‌నాత్మ‌కంగా ఉండాల‌ని కోరుకుంటారు. న‌లుగురిలోనూ స్పెష‌ల్‌గా ఉండాల‌ని భావిస్తారు. ఇలాంటి వారు ఐఫోన్ కొంటే బెట‌ర్‌. ఐఫోన్ 7 లేదా 7 ప్ల‌స్ అయితే వీరికి సెట్ అవుతాయి.

10. మ‌క‌రం
వీరు ఏ విష‌యంలో అయినా క‌చ్చితత్వం కోరుకుంటారు. 100 శాతం ప‌ని పూర్తి చేయాల‌ని ఉంటుంది. నాణ్య‌త‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. క‌నుక వీరు సోనీ కంపెనీకి చెందిన ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్ ప్రీమియం ఫోన్‌ను కొనుగోలు చేస్తే బెట‌ర్‌.

11. కుంభం
వీరికి ఎల్ల‌ప్పుడూ వినోదం కావాలి. దాన్నే ఎక్కువ‌గా కోరుకుంటారు. ఎక్కువ ఉల్లాసాన్ని ఆశిస్తారు. ఊహాశ‌క్తి అధికంగా ఉంటుంది. క‌నుక వీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్‌ను కొంటే మంచిది.

12. మీనం
వీరికి కొత్త అంశాల ప‌ట్ల ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. అంద‌రిక‌న్నా ముందుండాల‌ని భావిస్తారు. న‌లుగురిలోనూ టాప్ ప్లేస్‌లో ఉండాల‌ని కోరుకుంటారు. క‌నుక వీరు యాపిల్ ఐఫోన్ 7 ప్ల‌స్ తీసుకుంటే బాగుంటుంది

06/08/2017

*స్నేహ మంటే విశ్వరూపం*

మంచులా కరిగిపోతుంది
ముత్యంలా మెరిసిపోతోంది
మల్లెలా సువాసనలు విరజిమ్ముతుంది
కత్తిలా కోసేస్తుంది
పిడుచలా పిండేస్తుంది
ప్రేమతో చుట్టెస్తుంది
మెత్తగా అనిపిస్తుంది
టైమును మరిపిస్తుంది
ఎత్తుకు నడిపిస్తుంది
అమ్మయ్యా అనిపిస్తుంది
ఆకలిని మరిపిస్తుంది
నాలుగు ముద్దలు ఎక్కువ తినిపిస్తుంది
ఉషారుని కలిగిస్తుంది
ఉస్సురని పిస్తుంది
నీరసాన్ని జయిస్తుంది
సాహసంతో నడిపిస్తుంది
లోకం అందంగా కనిపిస్తుంది
నలుగురిలో బలమిస్తుంది
కష్టంలో గుర్తొస్తుంది
సుఖంలో తోడౌతుంది
దూరంలో జతౌతుంది
పగటి పూట మాటౌతుంది
రాత్రి పూట పాటౌతుంది
నడిపే నావౌతుంది
కాలే కట్టౌతుంది
అందమైన కుటుంబమౌతుంది
అలుపెరుగని అక్షరమౌతుంది
నిద్రలేపే పిలుపౌతుంది
నిద్రబుచ్చే జోలౌతుంది

ఆవేశమొచ్చినా ఆగదు
ఆనందమొచ్చినా ఆగదు
కోపమొస్తే పట్టలేము
తాపమొస్తే తట్టలేము
ప్రేమకు లొంగుతుంది
అమ్మౌతుంది
అక్కౌతుంది
అన్నౌతుంది
చెల్లౌతుంది
నాన్నౌతుంది
తమ్ముడౌతుంది
పెళ్ళాం మొగుడు బిడ్డ
అబ్బా ఎన్నెన్ని రూపాలతో
విశ్వరూప మౌతుంది

ఒకసారి అలుగుతుంది మూగగా రోదిస్తుంది
లోలోన వాదిస్తుంది
అన్నీ తానే అంటుంది
అంతా నీవే అంటుంది
నీ మాటే పలుకుతుంది
నీ బాటే నడుస్తుంది
నీ ఆట ఆడుతుంది
ఎన్నో భావనలు చేస్తుంది
ఎంతైనా తట్టుకుంటుంది
అన్ని తానే కావాలి
లోకమంతా తనతోనే
పసితనపు స్నేహం
ప్రౌఢ తనపు స్నేహం
పండువయసు స్నేహం
స్నేహం ఆదిలేదు
అంతంలేదు
ఎప్పుడొస్తుందో
తెలియదు
ఎలావస్తుందో
తెలియదు
ఎందుకొస్తుందో
తెలియదు
దానితో కలిసుంటే
అంతా ఆనంద డోలిక
లేకుంటే మనసంతా బాధిక
క్షణంలో ఎన్ని ఆలోచనలో
స్థిరంగా వుండనివ్వదు
వదిలి ఉండనివ్వదు
విడిగాను ఉండనివ్వదు
నిరంతర ప్రవాహం
కుసుమపరాగం
మోహనరాగం
మధురానురాగం
రాగ రంజని
భోగ భాజిని
మధుర ఫలం
మంగళ ప్రదం
అది మాటలకందనిది
మనసుకు తెలియనిది
అక్షరాలలో బంధీకానిది
అనుభవిస్తేనే తెలిసేది
అందమైన అనుబంధమది.
ఇంత గొప్ప స్నేహాన్ని అందించిన ఆ స్నేహితుని
జననీ,జనకులకు పాదనమస్కారములు,
ఆ ఉన్నత కుటుంబానికి
స్నేహాంజలి చాటుతూ
* స్నేహితుల రోజు శుభాకాంక్షలు*

19/12/2016

ఒకరోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియం లోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు...ఆ హాలు నిండా అద్దాలు ఉండడం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్ళు బయటపెట్టి అరిచింది...
చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేసాయి. గట్టిగా అరిచింది..అద్దాలలో కూడా అలాగే కనిపించింది. ఖాళీ గా ఉండడం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది.
రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆమ్యూజియం కాపలావాళ్ళు వచ్చి చూసే సరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటి నిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిధ్ధంగా ఉంది. కాపలావాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవ్వరు దీనిమీద దాడి చేశారు అని.... ఆకుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది....వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది.
ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే.....అది మనకు మంచి కానీ చెడుకానీ చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన చుట్టూ జరుగుతున్నది అంతా మన ఆశలు, కోరికలు,
ఆలోచనల ఫలితమే.
Note:- ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది, మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు...ఈ దర్పణం ముందు ఆనందంగా పోజు ఇవ్వండి....అంతా ఆనందంగానే ఉంటుంది.

Address

Palakollu
534260

Opening Hours

Monday 8am - 12pm
Tuesday 8am - 12pm
Wednesday 8am - 12pm
Thursday 8am - 12pm
Friday 8am - 12pm
Saturday 8am - 12pm

Telephone

+919397151342

Website

Alerts

Be the first to know and let us send you an email when Ananya Xerox & Net Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ananya Xerox & Net Center:

Share