Maa Mangalagiri

Maa Mangalagiri 📍 Maa Mangalagiri
📰 Local News | 📢 Promotions | 🎉 Events
🛍️ Small Business Support | 📸 Real-time Updates
📲 Stay connected with everything Mangalagiri!

23/06/2026

*కిరాణాషాపు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు*

*ఇకపై ప్రతినెలా ప్రధాన ప్రాజెక్టుల భూమిపూజ, ప్రారంభోత్సవాలు ఉండాలి!*

*20లక్షల ఉద్యోగాల కల్పనపై లోకేష్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం*

అమరావతి: రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, టీజీ భరత్ (ఆన్ లైన్ ద్వారా) హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చిన 750 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయి, ఇవి పూర్తిస్థాయిలో పట్టాలెక్కితే పెద్దఎత్తున రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి, సాధ్యమైనంత త్వరగా ఆయా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా పరిశ్రమల శాఖ, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రత్యేకశ్రద్ధ వహించాలని అన్నారు. పనులను వేగవంతంచేసి ప్రతినెలా ప్రాజెక్టుల భూమిపూజ, ప్రారంభోత్సవాలు ఉండేలా అధికారులు చొరవచూపాలని కోరారు.

*పరిశ్రమల ఆకర్షణకు పెద్దఎత్తున రోడ్ షోలకు ప్రణాళికలు*

నవంబర్ లో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ నాటికి సాధ్యమైనంత గరిష్టంగా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత సమ్మిట్ కి మించి ఈసారి పెద్దసంఖ్యలో రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించేలా విదేశాలతోపాటు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రోడ్ షోల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. గత నెలరోజుల వ్యవధిలో 210 భారీ పరిశ్రమలు తర్వాత దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన 26 ప్రాజెక్టుల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ప్రతి 15రోజులకోసారి కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమీక్షించాలని మంత్రి లోకేష్ కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆయా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పవర్, వాటర్, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో భారీగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ స్టేజిల్లో ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ పరిశ్రమలతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఎంఎస్ఎంఈలను కూడా ఆన్ బోర్డు చేయాలని అన్నారు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విశాఖపట్నంలో సాధ్యమైనంత ఎక్కువగా హోటల్ గదులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని పర్యాటకశాఖ అధికారులకు సూచించారు.

*స్లరీ పైప్ లైన్ పై అధ్యయనం చేయండి*

స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ మన ప్రభుత్వ ప్రత్యేకతలు, సులభతరమైన సర్వీస్ డెలివరీ అందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో గార్మెంట్ పరిశ్రమలను ఆకర్షించడానికి చేపట్టాల్సిన చర్యలు, అందించాల్సిన ప్రోత్సాహకాలపై సమావేశంలో చర్చించారు. ఎంప్లాయ్ మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అందించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న టెక్స్ టైల్ పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ ఉత్పత్తి చేసుకునేందుకు ఏడాదిపాటు బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. అనకాపల్లి – విశాఖ – విజయనగరం జిల్లాలు స్టీల్ హబ్ గా ఆవిష్కృతమవుతున్న నేపథ్యంలో కొత్తగా రాష్ట్రానికి వచ్చేందుకు మరికొన్ని ఉక్కు పరిశ్రమలు ఆసక్తిచూపుతున్నాయి, ఇందులో ప్రధానమైన ముడిసరుకు సరఫరా కోసం స్లరీ పైప్ లైన్ కావాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి, దీనిపై అధికారులు అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ సూచించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, పంచాయితీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవో షన్మోహన్, స్కిల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ గణేష్ కుమార్, ఏపీఐఐసీ ఎండీ ఏఎస్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

*ఆత్మకూరులో వైభవంగా వేణు గోపాల స్వామి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం**ముఖ్య అతిథులుగా పాల్గొన్న విన్నకోట శ్రీనివాసరావు, ఏనుగ...
21/06/2026

*ఆత్మకూరులో వైభవంగా వేణు గోపాల స్వామి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం*

*ముఖ్య అతిథులుగా పాల్గొన్న విన్నకోట శ్రీనివాసరావు, ఏనుగ కిషోర్*

*మంగళగిరి* మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఆదివారం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పున ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.ముఖ్య అతిథులుగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఏనుగ కిషోర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పున ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమంలో
ఆలయ కమిటీ చైర్మన్ మోతుకూరి రవి కుమార్,పార్టీ మండల ఉపాధ్యక్షులు కొమ్మా సుకుమార్, జొన్నకూటి శ్రీనివాసరావు, తాత కోటయ్య, కట్ట కృష్ణ, సోమరౌతు శివ నాగేశ్వరరావు, శానం మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

*క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి**బసవ తారకం ఆస్పత్రి ఏర్పాటుతో పేదలకు అందుబాటులోకి వచ్చిన ఖరీదైన క్యా...
21/06/2026

*క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి*

*బసవ తారకం ఆస్పత్రి ఏర్పాటుతో పేదలకు అందుబాటులోకి వచ్చిన ఖరీదైన క్యాన్సర్ చికిత్స*

*25 ఏళ్లలో దేశంలోనే పేరొందిన 650 పడకల సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిగా సేవలు*

*ఏడాదికి 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90 వేలమంది ఇన్ పేషెంట్లకు సేవలు*

*పవిత్ర యజ్ఞంగా బసవతారకం ఆస్పత్రిని నిర్వహిస్తున్న బాలకృష్ణ*

*25 ఏళ్లుగా నిరంతరం సేవలందిస్తోన్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్*

*హైదరాబాద్ లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు*

*సోమవారం రజతోత్సవాలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు*

హైదరాబాద్, జూన్ 21: క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రారంభమైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోకూడదన్న ఆలోచనతో బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో రూపుదిద్దుకుంది ఈ సంస్థ. ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను తక్కువ ఖర్చుతో, లాభాపేక్ష లేకుండా అందించాలన్న లక్ష్యంతో దివంగత నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో 1988లో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. వైద్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రవాస భారతీయులు, దాతల సహకారంతో ట్రస్ట్ ఏర్పాటుకు పునాదులు పడగా, 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా 100 పడకలతో ఆస్పత్రి ప్రారంభమైంది. అనంతరం సేవల విస్తరణకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో దేశంలోనే ప్రముఖ సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనా కేంద్రంగా ఎదిగింది.

*పేదల ఆస్పత్రి బసవ తారకం*

గత పాతికేళ్లుగా సేవాభావం, మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తూ బసవతారకం ఆస్పత్రి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రోగులు బసవ తారకం ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతేడాది 3 లక్షల మందికి పైగా అవుట్‌పేషెంట్లు, సుమారు 90 వేల మంది ఇన్‌పేషెంట్లకు ఆస్పత్రి సేవలందిస్తోంది. ఇప్పటివరకు 8 వేలకుపైగా క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగా, 86 బోన్ మ్యారో మార్పిడి చికిత్సలు నిర్వహించారు. క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయించే వారిలో 65 శాతం మందికిపైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తక్కువ వ్యయంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడం వల్ల పేదల ఆస్పత్రిగా బసవతారకం పేరు పొందింది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్–పీఎం జే (PM-JAY)తో పాటు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోని లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడంలో ఆస్పత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ప్రస్తుతం సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు రేడియాలజీ, పాథాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, మెడికల్ ఫిజిక్స్, పరిశోధన మరియు అభివృద్ధి విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు, సాంకేతిక నిపుణులు సేవలందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సుమారు 250 మంది వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు సేవలందిస్తున్నారు.

*స్క్రీనింగ్ బస్ ద్వారా గ్రామాల్లో క్యాన్సర్ బాధితులకు సేవలు*

తల, మెడ, రొమ్ము, సర్వికల్, ప్రొస్టేట్ క్యాన్సర్లతో పాటు వివిధ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లకు సమగ్ర చికిత్సలను ఈ ఆస్పత్రిలో అందిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నొప్పి నివారణ, సంపూర్ణ సంరక్షణకు సేవలు అందించే ప్రత్యేక పాలియేటివ్ కేర్ యూనిట్‌ను ఆస్పత్రి నిర్వహిస్తోంది. చికిత్సతో పాటు బాధితులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలను చేపడుతోంది. క్యాన్సర్ నివారణకు ముందస్తు గుర్తింపు, విస్తృత స్థాయి స్క్రీనింగ్ కార్యక్రమాలు జాతీయ ప్రాధాన్యతగా మారాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలను ఆస్పత్రి నిర్వహిస్తోంది. డిజిటల్ మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే సదుపాయాలు కలిగిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ద్వారా వైద్య సేవలను ఆస్పత్రికే పరిమితం చేయకుండా గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల వద్దకే తీసుకెళ్తోంది. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైద్య సేవలతో పాటు మానవత్వం, కరుణ, సేవాభావాన్ని మేళవిస్తూ క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సేవా దృక్పథంతో కూడిన వైద్య రంగ సంస్థగా గుర్తింపు పొందింది. దాతృత్వం, వైద్య నిపుణుల ప్రతిభ, సమాజం వైపు నుంచి లభించే మద్దతు, ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ క్యాన్సర్‌పై సమర్థవంతమైన పోరాటం చేయవచ్చని ఈ సంస్థ తన 25 ఏళ్ల ప్రస్థానంతో చాటిచెప్పింది. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవలను అందించాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించేలా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవాలను నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు బసవ తారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు మొదలు పెట్టగా... ఆయన వారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా భావిస్తున్నారు. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం ఆస్పత్రి పేదలకు మరిన్ని అత్యాధునిక సేవలను అందిస్తోంది. క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక వైద్య సేవలను మానవత్వం, సేవాభావంతో అందిస్తూ దేశంలోనే గుర్తింపు పొందిన ఈ వైద్యసంస్థ రజతోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వైద్య నిపుణులు, దాతలు, ఆస్పత్రి సేవలతో అనుబంధం కలిగిన అతిథులు హాజరు కానున్నారు.

*ఆత్మకూరులో వైభవంగా వేణు గోపాల స్వామి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం**ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆక...
21/06/2026

*ఆత్మకూరులో వైభవంగా వేణు గోపాల స్వామి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం*

*ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య*

మంగళగిరి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఆదివారం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పున ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయ సత్య గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పున ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమంలో
ఆలయ కమిటీ చైర్మన్ మోతుకూరి రవి కుమార్,పార్టీ మండల ఉపాధ్యక్షులు కొమ్మా సుకుమార్, జొన్నకూటి శ్రీనివాసరావు, తాత కోటయ్య, కట్ట కృష్ణ, సోమరౌతు శివ నాగేశ్వరరావు, శానం మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

17/06/2026

🚨 మంగళగిరిలో అదుపుతప్పిన ఆటో.. ఇద్దరు మహిళలకు గాయాలు

📍 గౌతమ్ బుద్ధ రోడ్డుపై ఓ ఎలక్ట్రికల్ ట్రాలీ ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.

🚗 ముందుగా రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఆటో, అనంతరం టిఫిన్ బండి వద్ద కూర్చున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది.

🏥 గాయపడిన మహిళలను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

📱 సెల్‌ఫోన్ చూస్తూ వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్‌కు లైసెన్స్ లేదని, మైనర్ అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

👮 ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

17/06/2026

🌳 కాజ ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభం 🎉

📍 మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు.

💰 సుమారు రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన ఈ పార్క్‌లో:

🌿 12,800 మొక్కలు
🚶‍♂️ 1.7 కి.మీ వాకింగ్ ట్రాక్
🏋️ ఓపెన్ జిమ్
🛝 చిన్నారుల ప్లే ఏరియా
💡 లైటింగ్ & అందమైన సుందరీకరణ

✅ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం, విశ్రాంతి కోసం ఈ పార్క్ అందుబాటులోకి వచ్చింది.

🌿
🌳
🏞️
🚶‍♂️
🌱

12/06/2026

🍗🔥 BIRIYANI READY AT FOODIE SPOT 🔥🍗

Craving for hot & delicious biryani? 😋
Visit Foodie Spot today!

🍗 Chicken Dum Biryani – ₹120/-

🍗 Chicken Fry Biryani – ₹150/-

♨️ Freshly Prepared

😋 Authentic Taste

❤️ Best Quality Every Time

📍 Foodie Spot
Dwarka Nagar, Mangalagiri

📞 Order Now: 9533 24 3333

🚀🛵 RAPIDO PARCEL SERVICE AVAILABLE 🛵🚀

🔥 Get your favorite biryani delivered quickly to your doorstep!

🛵 Also Available On: 🟧 Swiggy
🟥 Zomato
🟩 Total Fresh
🩷 Pinki Delivery

🔥 HOT BIRYANI • FAST DELIVERY • GREAT TASTE 🔥

10/06/2026

🚌 మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నుంచి తిరుపతికి నేరుగా బస్సు సేవ 🙏

📍 మంగళగిరి ఆర్టీసీ డిపో నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంది.

⏰ ప్రయాణ సమయాలు: ➡️ మంగళగిరి నుంచి రాత్రి 8:00 గంటలకు బయలుదేరి, ఉదయం 5:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

⬅️ తిరుపతి నుంచి ఉదయం 8:15 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5:50 గంటలకు మంగళగిరి చేరుకుంటుంది.

🙏 తిరుమల శ్రీవారి దర్శనం, విద్య, వైద్యం మరియు ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

✅ మంగళగిరి ప్రజలు ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.

08/06/2026

♿ ఎయిమ్స్‌కు 70 వీల్‌చైర్స్ అందజేసిన రోటరీ క్లబ్‌లు ❤️

📍 మంగళగిరి ఎయిమ్స్‌లో రోగుల సౌకర్యార్థం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సంయుక్తంగా రూ.3.50 లక్షల విలువైన 70 వీల్‌చైర్స్‌ను అందజేశాయి.

🤝 ఈ సేవా కార్యక్రమాన్ని రోటరీ ప్రతినిధులు, ఎయిమ్స్ అధికారులు కలిసి నిర్వహించారు.

👏 రోటరీ క్లబ్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఎయిమ్స్ యాజమాన్యం అభినందించింది.

🦾 దివ్యాంగులకు కృత్రిమ చేతులు, కాళ్లు అందించడం వంటి సేవా కార్యక్రమాలతో రోటరీ క్లబ్ మంచి గుర్తింపు పొందిందని డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్.వి. రాంప్రసాద్ తెలిపారు.

🏥 రోగులకు ఈ వీల్‌చైర్స్ ఎంతో ఉపయోగపడతాయని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతాసింగ్ పేర్కొన్నారు.

💐 సమాజ సేవలో రోటరీ క్లబ్‌ల సేవలు ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు.

♿❤️🏥

08/06/2026

🚔 సుపరిపాలన సభ ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు ఎస్పీ వకుల్ జిందల్ 🚔

📍 తుళ్లూరు మండలం రాయపూడిలో ఈ నెల 12న జరగనున్న “సుపరిపాలన” భారీ సభ ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందల్ పరిశీలించారు.

👮‍♂️ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

👥 సుమారు 10 వేల మంది ప్రజలు హాజరుకానున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

🚗 పార్కింగ్ ప్రాంతాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

🤝 అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు.

🚔✨

Address

Dwaraka Nagar
Vijayawada

Telephone

+917050090909

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Mangalagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maa Mangalagiri:

Shortcuts

Share