13/04/2014
కోట్లకు కోట్లు డబ్బులు, తాగినంత మద్యం... ఎం కావాలంటే ఆది చేస్తున్నారు ఈ నాయకులు. మేం రోడ్స్ వేపించాం. మేం బోర్ వేపించాం, మేం వాటర్ తెప్పించాం, అని ప్రతి సభలలొ, మీటింగ్‌లలో మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా బస్ లు లేని పల్లెలు, నీటి కోసం కిలోమీటర్లు దూరం నడిచివేల్తున్నారు . వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. కేవలం సర్పంచ్ ఎన్నికలలో లో రూ: 20,00,000 ఖర్చు చేశాడట ఒక సర్పంచ్. ఆ పంచిన డబ్బులు తీస్కోని ఓట్లని అమ్ముకుని మాకు ఆది లేదు ఇది లేదు అని గొడవ చేస్తూనే ఉన్నారు. ఒక పల్లెలో ఐతే పక్క వాళ్ళకి డబ్బు పంచారు కానీ మాకు పంచలేదు మేం ఓట్లు వేయం అని మరి గట్టిగా చెప్తున్నారు. తప్పు డబ్బు పంచె నాయకూలద ? లేక తీస్కోనే ప్రజలాదా ?. డబ్బులు పంచితే మాకు ఏమీ వద్దు అని తిరిగి ఇచే ప్రజల ఉన్నారా ?.. చాలా తక్కువ ఉన్నారు... ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మీరు మద్యానికి, డబ్బుకి మీ ఓటును అమ్ముకుంటే మాత్రం, మీరు నాయకులని పని చేయండి అని అడిగే స్వేత్చను కోల్పోతారు. గుర్తుంచుకోండి. నాయకుల ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నయ్ అని చూపించుకుంటున్నారు. లీగల్ గా నాయకుల పేర్ల మీద ఉంటే మాత్రమే లెక్కలోకి వస్తుంది. మరి బిణామిల సంగతి ఏంటి ?. అడిగే వారు ఎవ్వరూ లేరు అనే కదా వారి దైర్యం ... ఒకవేళ అడగడం మొదలు పెడితే ?.... ప్రతి చిన్న విషయానికి ప్రజలు లోతుగా ఆలోచిస్తే ?... ఏంటి వారి పరిస్థితీ.. ఒక సామాన్యుడి ఆకలి తీర్చడానికి, పిల్లలకి మంచి భవిష్యత్ అందిచాడానికి నాయకులను ఎన్నుకుంటే వాళ్ళు ఎం చేస్తున్నారు... తెలిసిన వాళ్ళకి కాంట్ర్యాక్ట్ లు, డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు.. ఇది ప్రబుత్వా పని తీరు.... ఇంకా మరెన్నో ప్రశ్నలు నాయకుల ఎదురుగా కూర్చుని అడగాలని ఉంది ,, మరి మీకు... ? మీకు కూడా అడగాలని ఉంటే వెంటనే స్పందించండి..