30/11/2019
మహాత్మ జ్యోతిరావు పూలే 1827వ సంవత్సరం ఏప్రిల్ నెల11వ తేది మహారాష్ట్రలోని సతారా -జిల్లాలో జన్మించారు. వీరి తండ్రి గోవిందరావు పూలే. తన వయస్సు 9 మాసాలు ఉన్నప్పుడే, జ్యోతిరావు పూలే గారి తల్లి స్వర్గస్తులైనారు.
జ్యోతిరావు పూలే వెనుకబడిన 'తరగతులకు చెందిన 'మాలి' అనే కులమునకు చెందినవారు. తండ్రి - గోవిందరావు కూరగాయల వ్యాపారం చేసేవారు. అతి కొద్దిపాటి వ్యవసాయం మాత్రమే వీరికి ఉండేది. తండ్రి మరియు చిన్నాన్న , పెదనాన్నలు పూలవ్యాపారంలో - కూడా ఉండటంతో వీరి కుంటుంబంలో వారిని 'పూలే' లుగా గుర్తించి అలానే పిలవటం జరిగినది. - జ్యోతిరావు పూలే గారి జీవితాన్ని మలుపుతిప్పిన ఓ ముఖ్యమైన సంఘటన 1848వ సంవత్సరంలో చోటుచేసుకున్నది. బ్రాహ్మణ కులమునకు చెందిన తన స్నేహితుడి పెళ్ళికి వెళ్ళిన జ్యోతిరావుపూలే, పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న కారణంగా అవమానమునకు గురి కావలసి వచ్చినది. బ్రాహ్మణులచే తక్కువ కులముగా
పరిగణించబడే 'మాలి' కులమునకు చెంది ఉండి, బ్రాహ్మణుల పెళ్ళి ఊరేగింపులో పాల్గొన్నందుకు, కార్యం అపవిత్రం కాబడినదని తన స్నేహితుని బంధువులు జ్యోతిరావు వూలేను అవమానించి , దుర్భాషలాడడం జరిగినది. ఆ సంఘటన జ్యోతిరావు పూలే వునన్సును ఎంత గానో కలిచివేసింది. కులవ్యవస్థమీద మురియు సామాజిక అసమానతలమీద పోరాడాలని తను నిర్ణయం తీసుకునేలా ఆ సంఘటన ప్రభావితం చేసినది. ప్రఖ్యాత రచయిత “థామస్ సైన్” వ్రాసిన 'మానవ హక్కులు' అనే పుస్తకం కూడా తన ఆలోచనా విధానాన్ని మరియు ఆలోచనా సరళిని ఎంతగానో ప్రభావితం చేసినది. అణగారిన వర్గాలైన మహిళలు, వెనుక బడిన
"తరగతులకు చెందిన వారిని తగు విధంగా జాగృతి పరచడమొక్కటే, సామాజిక అసమానతలకు పరిష్కారమని జ్యోతిరావు పూలే గట్టిగా భావించారు. ఆ క్రమంలోనే వివిధ అంశాలపై తగు అవగాహనను పెంపొందించుటకు అవసరమైన సామాజిక ఉద్యమానికి తెరలేపి, అలుపెరుగని పోరాటం సల్పారు.బహుజనోద్దారణ, దళితులవిముక్తి, సామాజిక న్యాయం, ఇవి జ్యోతిరావు పూలే యొక్క ప్రధాన ఆశయాలు, మనువాదులకు యిచ్చే దానధర్మాలకన్న వెనుకబడిన కులాలలకు చేసేవిద్యాదానం ' మిన్న, అని ఉపన్యాసాలద్వారా,శూద్ర-అతిశూద్ర కులాల్లో సామాజిక చైతన్యానికి.కొత్త ఊపిరి పోశారు. 'మను'వాదు సంకెళ్ళనుండి విముక్తి చేయటం, వారికి విద్య యొక్క ప్రాముఖ్యతను భోధించేవారు మనువాదులవ్యవస్థ శూద్రులను బలవంతంగా, మోసపూరితమైన కుట్రలతో చదువులకు దూరంగా ఉంచటం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో పూలే ఎంతో ధైర్యంగా కార్యదీక్షతతో ఇంటింటికి వెళ్ళి చదువులు లేకపోవటం వలన బానిసలుగా జీవిస్తున్నాం. "చదువు యొక్క ప్రాముఖ్యతను.పిల్లల ఉజ్వల భవిష్యత్తుని వారికి తెలియజేసి పిల్లలను బడికి పంపేటట్లు ఒప్పించటం జరిగినది. బడికి - రాని పిల్లలను గోనె సంచిలో బడికి తీసుకుని - వచ్చేవారు.
సామాజిక వ్యవస్థ చిందరవందరగా ఉన్నకాలంలో పూలే, శూద్ర-అతిశూద్ర కులాలలో విద్యావ్యాప్తి కొరకు చేసిన కృషి అంతసులువైన పనికాదు. పూలే సేవలను బ్రిటీష్ పాలకులు గుర్తించి ఆయనకు 'సన్మానం చేశారు. అప్పుడు పూలే వయస్సు 25 సం||లు ఆరోజుల్లో బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్, ఆసికిస్ పేరి దొర, 1852 లో ఈ గొప్పకార్యాన్ని చేసినారు. " అలాగే స్త్రీల విద్యాబోధన గుర్తింపు ఆనాడు సరి కొత్త విద్యావిధానాన్ని ప్రకటించి అనేక చోట్ల మిషనరీ స్కూల్స్ ప్రారంభించటం జరిగింది. అప్పటి వరకున్న సంస్కృత భాష స్థానంలో ఇంగ్లీష్ భాష ప్రవేశపెట్టినారు. శూద్రులకు, అతి . శూద్రులకు, బ్రాహ్మణులు అనే తేడా లేకుండా విద్యారంగంలో సౌలభ్యం అందరికీ వర్తించటం జరిగింది. మనువాదులతో ఉన్నంత కాలం శూద్రులకు, అతిశూద్రులకు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం దొరకదని, వీలైనంత తొందరగా శూద్రు, అతి శూద్రులు బయట పడాలన్న నగ్నసత్యాన్ని తెలుసుకున్నారు. .పూలే తిరుగుబాటును తట్టుకోలేని మనువాదులు వారి ఉక్రోషాన్ని వెళ్ళగక్కి వారు ఆంగ్లేయ పాలన వచ్చినప్పటి నుండి ఈ శూద్ర వెధవలకు కొమ్ములొచ్చాయని కసురుతూ, బడిలో, ‘మహర్'పిల్లలకు ప్రవేశం ఇవ్వద్దని మనువాదులు ఆందోళన చేశారు. అంటరాని పిల్లలను ఒకటవ తరగతిలో ప్రవేశం ఇచ్చిన వెంటనే 'మను'వాద ధర్మం నాశనం చేస్తున్నారు. అంటూ మీ బడిలో చెప్పేవాళ్ళైనా ఉండాలి లేదా మేమైనా ఉండాలి . అంటూ 'అంగ్లేయ అధికారిని బెదిరించారు. అంటరాని వారికి మేము చదువు చెప్పము వాళ్ళు మేము. కలిసి చదవడం జరగదని మా బ్రాహ్మణులధర్మం అపవిత్రమైపోయిందని మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని జపించి శుద్ధి చేసుకోవాలి. మా శరీరమంత మైలఅంటుబడిపోయింది అంటూ వెళ్ళిపోయినారు.
వితంతు వివాహ సంస్కరణను సమర్థించుట. వితంతు వివాహము పునర్వివాహ లేదా మారు మనువు అనే సంస్కరణము దేశంలో మూలవాసులలో తరతరాలనుండి కొనసాగుతున్నది కానీ ఇటువంటి సంస్కారవంతమైన సాంప్రదాయం మనువాదులలో లేదు. వితంతువులకు వునర్వి వాహము చేసుకునే హక్కులేదు. వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియులభర్త చనిపోయిన వాని భార్యకు తలగొరిగించి తెల్లబట్టలు మాత్రమే ధరించాలి. అలా చేయకపోతే వారిని కులంనుండి బహిష్కరించే వారు.. ఇలా అమానుష్యంగా ఉన్న . స్త్రీలపరిస్థితులను పూలే మానవతా థృక్పథంతో ఆలోచించి వీరిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశ్యంతో ఈ దుస్థితి నుండి వితంతువులకు ఆయన నేతృత్వం ఒక వితంతువుకు ( వైష్ణవ కులం) వివాహం జరిపించినాడు. . వితంతువులపిల్లలకు 1873లో ఒక శరణాలయం ఏర్పాటు చేసినారు. ఈ శరణాలయం లోనే కాశీబాయి అనే వితంతువుకు పురుడు పోసి బొడ్డుతాడును కత్తిరించి ఆ పిల్లవాడిని అల్లారి ముద్దుగా పెంచి యశ్వంత్ అనే పేరు .. పెట్టిన మహామునిషి . ఇలాంటి శరణాలయం భారతదేశంలో మొదటిది. ఈ తరం వారికే కాకుండా ముందుతరాలవారికి కూడా ఆదర్శంగా, నిలిచిన ఆయనకును రాష్ట్ర పితగా గౌరవించారు. శూద్రులు-అతిశూద్రులు మరియు వితంతువులకు పుట్టిన మనువాదులఘోరకృత్యాలకు జన్మించిన పిల్లలకు రక్షణ కల్పించిన మహానీయుడు. అందరికి ఉపయోగపడే నీటి గుంటలు: మనువాదులకు మాత్రమే నీటి బావులుండేవి. శూద్ర-అతిశూద్రులు నీటికోసం కొన్ని మైళ్ళ దూరం వెళ్ళినా దొరికేవి కాదు. ఆ పరిస్థితుల్లో పూనా మున్సిపాలిటీతో 1858 నీటి సదుపాయం కల్పించేంతవరకు నిరవధికంగా (దాదాపు 4 సం||లు) పోరాడి సాధించటం జరిగినది. ఆ పరిస్థితుల్లో 1857 సిపాయి • తిరుగుబాటు మొదలయింది. కాని శూద్రు-అతిశూద్రులు మంచినీరు లేక ప్రాణాలు కోల్పోతుంటే వీరి సమస్యలు పరిష్కరించటం కోసం " ని పాయిల తిరుగుబాటులో - చేరకుండా, • బహుజనుల ప్రాణాలను కాపాడటానికి ప్రాధాన్యం.ఇచ్చిన ఆదర్శమూర్తి పూలే, శూద్ర-అతిశూద్రులకు " దొరకటం శుభారంభంగా భావించారు.
కార్మిక కర్షకుల హక్కుల సాధనకు పోరాటం: వివిధ .. రంగాల్లో సామాజిక, ధార్మిక శ్రామిక రంగాలలో పని - చే నున్న మహిళలన మన్యలతో బాటు వ్యవసాయరంగంలో , కూలీలు, చిన్న చిన్న రైతుల సమస్యలపట్ల ఆయన దృష్టిసారించారు. వారి జీవితాల్లోకి, అభివృద్ధి సాధించి పెట్టారు. పూలే ఈ నత్యశోదక్" నమాజ్ కార్యక్రమాలను నిర్వహించుతున్న సమయంలో బొంబాయిలో మిల్లు కార్మికులసమస్యలు అవగాహన చేసుకున్నారు. ఆ చాలీ చాలని జీతాలతో బాధపడుతున్న కార్మికులు కు ఎక్కువమంది శూద్ర-అతిశూద్రులే. భారతదేశంలో తొలిసారిగా కార్మిక, కర్షక రైతుల ఐక్యత గురించి కలసి పోరాటం చేస్తేనే విజయం సాధించగలం అనే పిలుపునివ్వడం జరిగింది. చైతన్యవంతులను చేసి " కార్మికులకఠినమైన సమస్యలకు పరిష్కారము, సామాజిక, ఆర్ధిక సమస్యలను దూరదృష్టితో 'క చూడడం అమోఘమైనది. ఈ విషయంలో పూలే బహుముఖ ప్రజ్ఞాశాలి.విద్యా దానం అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావాలు ఎలా ఉండాలి? అన్న విషయములమీద ఒక ప్రత్యేకత ఉండేది. పూలే స్వయంగా అధ్యాపకులవ్వటం ఒక విషయమయితే, స్త్రీలకు : విద్యను బోధించుట సామాజిక కార్యక్రమాలు.ప్రారంభించుట మరో విశేషం. విద్యారంగంలో విధ్యకు సంబంధించిన విషయాలను కొన్ని - హేతుబద్ధంగా పరిశోధించి దానికి అనుగుణంగాకొన్ని సలహాలు ఇవ్వటానికి 1882 సం|| లో సర్విలియం హంటర్, అధ్యక్షతన ఒక కమిటీని నియమించటం జరిగినది. ఈ కమిటీకి అక్టోబర్ - 19, 1882 లో సాధారణ వ్యాపారిగా, రైతు.బందువునిగా పరిచయం చేసుకున్నాడు. ఆంగ్లేయ -విద్యా రంగంలో ప్రవేశ పెట్టదలిచిన" ఫిల్టర్ థియర్”ని పూలే తీవ్రంగా వ్యతిరేకించారు.కాలేజీల్లోను, - విశ్వవిద్యాలయాల్లోను పదవులు సంపాదించిన అగ్రకులాలవారు శూద్ర-అతిశూద్రులకు చేసిన మేలు ఏమిటని. వీరు - క నీ న . - శూద్ర-అతిశూద్రుల అభివృద్ధి కోసం ఏ ఒక్కరోజైనా
ఆలోచించారా అని పూలే ప్రశ్నించారు. మనువాదులు ఈ దేశ మూలవాసులైన శూద్రులను అమానుషంగా అణిచిపెట్టి " సమాజానికి దూరంగా గెంటి వేసిన వాస్తవాలను హంటర్ కమీషన్ ఎదుట: చాలా బలమైన ఆధారాలతో నిరూపించారు.
ప్రాథమిక విద్యను ప్రభుత్వం సామాన్యులకు . - అందించాలని తొలిసారిగా పూలే ప్రతిపాదించారు.హంటర్ కమీషన్ - ప్రతిపాదనను - కమీషన్ - అంగీకరించేటట్లు తీవ్ర పోరాటం చేసిన మహామనిషి - మన పూలే. బానిసత్వానికి వ్యతిరేకంగా బావుటా “గులాంగిరి” : ఈ దేశంలోని సామాన్యులను రైతులను వ్యవసాయ కూలీలను బానిస బ్రతుకులనుండి విముక్తి చేయాలన్న సంకల్పంతో పూలే 'గులాంగిరి' అనే గ్రంథాన్ని వ్రాసినారు. 1873 సం||లో గ్రంథాన్ని వ్రాసి ఒక చోట పూలే తన ఆవేదనను ఇలా వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలు-శూద్రుల్ని అనేక విధాలుగా నాశనం చేస్తారు. అణిచివేత ఉన్నత విద్యలో కుటిలత్వంతో ఉన్నత స్థానాలను ఆక్రమించి తద్వారా నాశనం కొనసాగిస్తాడు. మొత్తం దేశమంతటా ఇదేస్థితి.'గులాంగిరి” గ్రంధాన్ని నిమ్న - జాతులపోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు - అంకితం ఇచ్చారు పూలే. ఒక చక్కటి తార్కాణం - మనిషి మానవ అతీత శక్తులను విశ్వసించకుండా తమ తమ స్వయం శక్తి సామర్థ్యాలమీద ఆధారపడటమే ఉత్తమమని సలహాయిచ్చినారు.నవంబరు 28, 1890 సామాజిక - పోరాట యోధుడు రాష్ట్ర పిత మహాత్మ జ్యోతిరావు పూలే. మననుండి దూరమై 129 సం||రాలు గడిచినా ఆయన ఆనాడు చేసిన పోరాటం నేటి కీ అంతంకాలేదు. ఆయన ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చడానికి బడుగు వర్గాల ఉద్యోగులు తాము సంఘటితంగా వారి లక్ష్యాన్ని చేరడానికి కార్యోన్ముఖులు కావాలి. ఆ లక్ష్యంలో భాగంగానే బిసి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు అన్ని శాఖల్లో తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సంఘటితంగా ఏర్పడి బలమైన మహాత్మ జ్యోతిరావు పూలే ఉద్యమాన్ని కొనసాగించిన నాడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినవారమవుతాము.
..ఇట్లు..
.......యర్రమళ్ళ రాములు........
.మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు .
..ఎస్.సి.,ఎస్టీ.,బి.సి.,ముస్లీం మైనార్టీ ఫ్రంట్ అడ్పైజర్..