TriCAD Design Consultants Pvt Ltd

TriCAD Design Consultants Pvt Ltd TriCAD provides comprehensive engineering design in Telecom, Utilities, GIS, RS, LiDAR and Photogrammetry

Founded in 1993, TriCAD provides comprehensive GIS, RS and Photogrammetry Services for the India and overseas clients. Recognized by DoS for its GIS, RS and Photogrammetry services. TriCAD maintains high standards of excellence in client service and product quality. TriCAD is an ISO 9001:2015 certified organization headed by industry experienced professionals with ASI, Tele Atlas and InfoTech for

various Utility, Telecom, Land base, Migration, RS and Photogrammetry projects. BS7799 security system is in place at TriCAD to ensure the client data protection

Happy teachers dayజపాన్లో టీచర్స్ డే ఉండదట..అసలు జపాన్ దేశస్దులకు అలాంటి ఓ రోజు ఉందనే సంగతే తెలియదు..అసలు కథ చెబుతా వినం...
05/09/2024

Happy teachers day

జపాన్లో టీచర్స్ డే ఉండదట..

అసలు జపాన్ దేశస్దులకు అలాంటి ఓ రోజు ఉందనే సంగతే తెలియదు..

అసలు కథ చెబుతా వినండి..

మన దేశంలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఓ మాస్టారు
ఢిల్లీలో అవార్డు స్వీకరించి అటు నుంచి అటే జపాన్ వెళ్లారు..అక్కడ తన మిత్రుని కుటుంబంతో కొన్నాళ్ళు గడిపి పనిలో పనిగా ఆ గొప్ప దేశంలోని విశేషాలు..టోక్యో వంటి మహానగరాన్ని చూసి వద్దామని..

టోక్యోలోనే నివాసం ఉంటున్న మాష్టారి మిత్రుడు
ఆయన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు వచ్చాడు.పరస్పర ఆలింగనాలు..క్షేమ సమాచారాలు అయిన తర్వాత ఇద్దరూ కలిసి
మిత్రుడి ఇంటికి బయలుదేరారు.

లోకల్ రైల్వే స్టేషన్లో కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే మాస్టారికి తెలిసింది జపాన్లో టీచర్స్ డే జరపరని..ఆయన ఆశ్చర్యపోతూ అదేంటి ఇన్ని రంగాల్లో ఇంత గొప్ప అభివృద్ధి సాధించిన మీ దేశంలో మీ అభ్యున్నతికి కారణమైన గురువులను సత్కరించుకోరా..అందుకోసం కనీసం ఒక రోజును కేటాయించి టీచర్లను గౌరవించలేరా అని కొంచెం కోపంగానే దులిపేసారు మిత్రున్ని..మాస్టారి ఫ్రెండ్ మౌనంగా ఉండిపోయాడు..!

ఈలోగా ట్రెయిన్ వచ్చింది.
కంపార్ట్మెంట్ కిక్కిరిసి ఉంది.మిత్రులు ఇద్దరూ జనం మధ్య కొంచెం చోటు చేసుకుని నిలబడ్డారు.
ఈలోగా వారి కంటే పెద్దాయన తాను లేచి మన మాస్టారిని కూర్చోమన్నాడు.
వద్దులెండి..మేము సర్దుకుంటాం..మీరు పెద్దవారు కదా అన్నా ఊరుకోకుండా ఆయన మాస్టారిని చెయ్యి పట్టి మరీ తన సీట్లో కూర్చోబెట్టాడు.
మాష్టారు ఆ ఘటన పట్ల నిర్ఘాంతపోయారు.

రైలు దిగి వెళ్తుంటే కొందరు మాష్టారి మిత్రునికి గాక ఆయనను విష్ చేస్తున్నారు.
ఈసారి మాస్టారి ఆశ్చర్యం రెట్టింపయింది.ఇక ఉండబట్టలేక మిత్రున్ని అడిగారు. ఏమిటిదంతా అని.. అప్పుడూ మిత్రుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

ఆ తర్వాత మాస్టారు మిత్రునితో అన్నారు..మీ ఇంటికి వెళ్తున్నాము కదా..
పిల్లలకి ఏమైనా కొందాము
అంటే మిత్రుడు ఒక షాపుకి తీసుకెళ్ళాడు.

అక్కడా మాస్టారికి రాజపూజ్యమే..కొన్న ప్రతి వస్తువుకీ తగ్గింపే.. మాష్టారి నోట మాట రాలేదు.
అలా మాట్లాడుకుంటూ
ఇంటికి చేరారు మిత్రులు ఇద్దరూ..అక్కడ మాస్టారికి బ్రహ్మరథమే..అఖండ స్వాగతం..సత్కారం..
కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు జల్లుకోలేదు కానీ ఆ దేశ సంప్రదాయం ప్రకారం అన్ని విధాలా గౌరవించారు మాస్టారిని..

ఇక మాస్టారు ఆగలేదు..
ఏంటి ఇదంతా..నన్నో దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నారేంటి
మీ దేశంలో..అని నిలదీశారు మిత్రున్ని..

అప్పుడు చెప్పాడు ఆ స్నేహితుడు..నువ్వు మీ దేశంలో సన్మానం అందుకుని
నేరుగా ఇక్కడికి వచ్చావు కదా..నీ మెడలో టీచర్ అనే బ్యాడ్జీ ఇంకా అలాగే ఉంది.
అదే నిన్ను ఇలా అంత ఎత్తులో కూర్చోబెట్టింది.

మా దేశంలో టీచర్లకు చాలా విలువ ఇస్తాము..ఏ దేశం వారైనా..టీచర్లు మాకు అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులు.వారికి ఎనలేని గౌరవం ఇస్తాం.టీచర్లు రైళ్లలో..బస్సుల్లో నిలబడకూడదు..
క్యూల్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు.కొనుగోళ్లలో రాయితీలు..ఇంకా ఎన్నో గౌరవాలు..ఇక్కడ టీచర్లు
మొదటి తరగతి పౌరుల లెక్కన్నమాట..అందుకే ఇందాక రైల్లో..స్టేషన్లో నీకు అంత గౌరవం లభించింది.
సర్వకాలసర్వావస్థలలో టీచర్లను ఇంతలా గౌరవిస్తాం గనకనే మాకు టీచర్స్ డే అంటూ ప్రత్యేకంగా ఉండదు.
ఇదీ సంగ్రహం..!

మాస్టారికి నోట మాట రాలేదు.అంతకు కొన్ని గంటల ముందు తనకు జరిగిన సత్కారంతో పోలిస్తే దేశం కాని దేశంలో అపరిచితుడుగా లభించిన మర్యాద ఏ మాత్రం తీసిపోదనిపించింది.
ఆ అనుభవం ఆయన్ను ఉక్కిరబిక్కిరి చేసింది.
అంతే కాదు.ఇటీవలి కాలంలో దిగజారుతున్న మన విలువలు..గురువుల పట్ల సన్నగిల్లుతున్న గౌరవమర్యాదలు..సినిమాల్లో టీచర్లను ఆట పట్టిస్తున్నట్టు తీస్తున్న సన్నివేశాలు..అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు గిర్రున తిరిగాయి..

ఇది కదా నిజమైన సంప్రదాయం..
ఇది కదా గురుదేవో మహేశ్వర అన్న ధర్మానికి నిజమైన తార్కాణం..
ఇదే కదా గురుసాక్షాత్
పరబ్రహ్మకు వాస్తవ రూపం..
అనుకుంటూ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ
మిత్రుని వెంట గెస్ట్ రూముకి నడిచారు.

అందుకే జపాన్ ప్రపంచ దేశాల్లో అన్నిటా అగ్రగామిగా ఉంది..

TCS GEMS awarded to Rahul today. Nice to share this proud moment with you my friends That’s excellent, keep up good work...
27/05/2024

TCS GEMS awarded to Rahul today. Nice to share this proud moment with you my friends
That’s excellent, keep up good work Rahul 👏👏👏

05/04/2024

Dear Friends

During the last few days when I attended weddings or functions I noticed the guests are served with bottled water. It's painful to see that most of the guests have a sip and leave the remaining water. The bottles are then taken away by the cleaners and dumped in the trash.
What a waste !!! 😢

🙏May I please request all of you to carry the remaining water Bottle with you to consume later or can use it for other purposes like watering plants / birds.

Across the country we are facing drought and people are struggling for water. It's time we start saving every drop of water.

If you think it's correct, then don't hesitate to forward this msg to your friends and other Groups.

Save Water Save Life.
🙏🙏🙏🙏🙏
*जल ही जीवन है*

19/03/2024

📚ఒక మనవరాలి కథ

*అనగనగా ఒక డెబ్బైయ్యేళ్ల తాత, ఒక ఏడేళ్ల మనవరాలు. సాయంకాలం ఆ తాత మనవరాలి చిటికెన వేలు పట్టుకుని అలా ఊరి బయట మర్రిచెట్టుకాడ ఉండే రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి ఊరి పెద్దలతో కబుర్లలో పడిపోయేవాడు. ఆ మనవరాలు మాత్రం రచ్చబండ దిగి అక్కడే ఉన్న గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చూస్తుండేది. అలా నాలుగు రోజులు పుస్తకాలు చూశాక చదివి చూడాలనిపించింది. పిల్లల కథల పుస్తకం కనిపిస్తే చదివేసింది. టైమే తెలియలేదు. చీకటి పడ్డాక తాతవచ్చి చిటికెన వేలు అందిస్తే పుస్తకం మూసి తాతతో పాటు ఇంటికొచ్చేది. అలా అలా ఆ మనవరాలికి పన్నెండేండ్లు వచ్చేసరికి గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలూ చదివేసింది. కొత్తపుస్తకం ఒక్కటీ మిగల్లేదు. ఇక గ్రంథాలయానికి వెళ్ళాలంటే విసుగనిపించేది. తాతయ్యతో పాటు మర్రిచెట్టు కిందే కూర్చునేది.*

*ఒక రోజు చీకటి పడింది. కళ్లు కనిపించని తాత చిటికెన వేలు పట్టుకుని దోవ చూపిస్తూ ఇంటికి తీసుకెళుతోంది. ఉన్నట్టుండి తాత ఆగిపోయి, “నేనొక గేయం మొదటి లైను చెబుతాను, నువ్వు దాన్ని పూర్తి చెయ్యగలవా? ఇది అందరికీ తెలిసిన గేయమే!" అని పద్యాల ఆటలోకి దిగాడు.*

*“సరే! అని మనవరాలు కూడా ఆటలోకి దిగింది.*

*_“నాకే రెక్కలుంటే....”_* *అనే గేయాన్ని తాత ఆరంభించాడు. మామూలుగా అయితే ఆ గేయం ఇదీ 😗

_‘నాకే రెక్కలుంటే నీలాకాశంలోకి ఎగిరిపోతాను_
_అందమైన చోట్లెన్నో చూస్తాను_
_గొప్పవారిని కలుస్తాను_
_గుప్తనిధులు వెతుకుతాను'_

*ఈ పద్యం మనవరాలికి తెలిసినా..., అప్పటికప్పుడు ఇలా సరికొత్తగా మొదలెట్టి..*

*_“నాకే రెక్కలుంటే..._*
*_పక్కూరి గ్రంథాలయానికెగిరి పోతాను_*
*_మరిన్ని పుస్తకాలు చదివేస్తాను”_*
*అని చెప్పింది.*

*ఆ చీకట్లో తాత కళ్లు మిలమిలా మెరిశాయి.*

*ఆ తాత ఆ మనవరాలితో ఆ రాత్రి పక్కమీద ఇలా అన్నాడు. "వంద సంవత్సరాలకు ముందు అమెరికాలో ఆండ్రూకార్నెజీ అని ఒకాయన ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు. చనిపోయేటప్పుడు ఆస్తి పిల్లలకు చెందాలని రాయలేదు. ఆ డబ్బుతో వీలైనన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు కట్టించాలని రాశాడు. నేను అమెరికా అయితే వెళ్ళి చూళ్లేదు గానీ అక్కడి గ్రామాల్లో కనిపించే ప్రతీ గ్రంథాలయం ఆయన డబ్బుతో కట్టించిందేనంటారు.*

*నీకు పుస్తకాలంటే ఎంతిష్టమో ఈ గేయాన్ని పూరించడం బట్టి తెలిసింది. నాకు మాటివ్వు. పెద్దదానివైన తర్వాత, నీ దగ్గర అవసరానికి మించిన డబ్బుంటే ఒక్క గ్రంథాలయానికైనా పుస్తకాలు కొనిస్తానని ప్రమాణం చెయ్యి."*

*ఆ మనవరాలు అమాయకత్వంగా ఆ తాత చేతిలో చెయ్యివేసింది.*

*ఆ పాప చదువుతూ చదువుతూ పెద్దదైంది. 1974 సంవత్సరానికంతా బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సి. ప్రాంగణంలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయగలిగిన ఆడపిల్ల దేశంలోనే ఒక్కటే అయ్యింది.*

*ఇంకా ఇంకా పెద్దదైంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్ అయ్యింది, ఆ తాత మనవరాలు.*

*ఆమె పేరు - సుధానారాయణ మూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుమారు పదివేల గ్రంథాలయాలకు పుస్తకాలు కొనిచ్చి తాత కలను నెరవేర్చింది. సుధామూర్తిగారి కథలో తెలుసుకోవలసింది ఏమిటంటే - కనిపించిన మంచి పుస్తకమల్లా చదవబట్టే ఆమెకి ఐన్స్టీన్నీ, న్యూటన్నీ అవగాహన చేసుకునే శక్తి, పుష్టి కలిగాయి. ఆమె మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు. ప్రపంచంలోనే గొప్ప సృజనాత్మక శక్తిగా ఆవిర్భవించింది. ప్రపంచ విజయాలు సాధించేది _‘పుస్తకాల పురుగులే’_ అని నిరూపించింది.*
*_{"పూలు - పళ్ళు" అనే సంకలన పుస్తకం నుండి సేకరించిన అంశమిది. 🙏}_*
------------------------
_ఇక ఇప్పుడు ఆ మనవరాలు గురించి మరికొంత సమాచారం.._

*2024 మార్చి-08, మహిళా దినోత్సవం రోజున రాష్ట్రపతి కోటా కింద “సుధా మూర్తి” గారు రాజ్యసభకు నామినేట్ అయ్యారు.*

*"సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం” అని తనను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రధాన మంత్రి తెలిపారు.*

Thanks to our kakumanu integrated trust and pragathi mahilamandali for their excellent hosting and successful program.  ...
12/03/2024

Thanks to our kakumanu integrated trust and pragathi mahilamandali for their excellent hosting and successful program. Nearly 400 women and 200 men attended this. My father enjoyed well whole program. Kudos to entire team 🤝🤝🤝🤝🤝🤝

25/01/2024

*August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?✍️*

*ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది.

*అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.*

*ఆ తేడా ఏమిటో తెలుసుకుందాము*👇

*👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.*

*ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.*

*మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.*

*👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*.

*ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.*

( *గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి* ).

*దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.*

*స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.*

*అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు.*

*అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే..*

*👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు*(Flag Hoisting).

*👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు* (Flag Unfurling) .

*ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.*

*👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది.*

*👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.*

*ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).*

*కావున ఈ information ను share చేసి మన వాళ్లకి అవగాహన కల్పించడం మన బాధ్యతగా భావించండి. ముఖ్యంగా విద్యార్దులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.*

22/01/2024

*నేటికీ ఆదర్శం శ్రీరామ*

*జనవరి 22 అనగా ఈరోజు శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ భవ్య మందిర నిర్మాణంలో భాగంగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంగా మా శుభాకాంక్షలు..*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జన్మనిచ్చిన వారి మాట
లెక్కచేయని నేటి పిల్లలకు
జనకుల మాట జవదాటాని
నీ క్రమశిక్షణ నేటికీ ఆదర్శం శ్రీరామ

గురువులను అగౌరవపరుస్తూ
అవహేళన చేస్తున్న నేటి యువతకు
గురువులను పూజించి ఆదరించిన
నీ నిబద్ధత నేటికీ ఆదర్శం శ్రీరామ

ఆస్థులకోసం రక్తసంబంధాలను సైతం
రచ్చకీడుస్తున్న నేటి కాలంలో
సోదరులకోసం రాజ్యాన్నిసైతం త్యాగంచేసిన
నీ సౌభ్రాతృత్వం నేటికీ ఆదర్శం శ్రీరామ

తుచ్ఛమైన వాంఛలకోసం
పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టుకుంటున్న నేటి భార్యాభర్తలకు
పత్నికోసం పదితలలు నరికిన
నీ ఏకపత్నిత్వం నేటికీ ఆదర్శం శ్రీరామ

స్వార్ధప్రయోజనాలతో స్వచ్ఛమైన స్నేహానికి
తూట్లు పొడుస్తున్న నేటి స్నేహితులకు
నిస్వార్థంగా స్నేహితులను సహరాజులను చేసిన
నీ స్నేహానిరతి నేటికీ ఆదర్శం శ్రీరామ

పాలకులైతే చాలు ప్రజలను పీడించి
తరగని ఆస్తులను జమచేస్తున్న నేటి ఏలకులకు
ప్రజలను కన్నబిడ్డలవలే పాలించిన
నీ రామరాజ్యం నేటికీ ఆదర్శం శ్రీరామ

పూటకో మాటతో పబ్బంగడుపుతూ
ఇచ్చిన మాటకు విలువివ్వని నేటి సమాజంలో
ఆడిన మాట జవదాటాని
నీ వాక్పరిపాలన నేటికీ ఆదర్శం శ్రీరామ

నమ్మకద్రోహమనే పదం
నిత్యకృత్యమౌతున్న నేటి జనాలకు
నమ్మివచ్చిన వారిని అక్కున చేర్చుకున్న
నీ వాత్సల్యం నేటికీ ఆదర్శం శ్రీరామ

09/01/2024

Trimble Inpho - Match-3DX, TrueOrtho, 3D modeling, Mesh modeling

𝐊𝐚𝐫𝐠𝐢𝐥 𝐕𝐢𝐣𝐚𝐲 𝐃𝐢𝐰𝐚𝐬 🇮🇳23𝐫𝐝 𝐲𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐊𝐚𝐫𝐠𝐢𝐥 𝐕𝐢𝐜𝐭𝐨𝐫𝐲 ✨𝐑𝐞𝐦𝐞𝐦𝐛𝐞𝐫𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐇𝐞𝐫𝐨𝐞𝐬 𝐨𝐟 𝐊𝐚𝐫𝐠𝐢𝐥 🙏
26/07/2022

𝐊𝐚𝐫𝐠𝐢𝐥 𝐕𝐢𝐣𝐚𝐲 𝐃𝐢𝐰𝐚𝐬 🇮🇳
23𝐫𝐝 𝐲𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐊𝐚𝐫𝐠𝐢𝐥 𝐕𝐢𝐜𝐭𝐨𝐫𝐲 ✨
𝐑𝐞𝐦𝐞𝐦𝐛𝐞𝐫𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐇𝐞𝐫𝐨𝐞𝐬 𝐨𝐟 𝐊𝐚𝐫𝐠𝐢𝐥 🙏

This World Youth Skills Day we renew our commitment to skill, upskill and reskill for life - grooming youth to face any ...
15/07/2022

This World Youth Skills Day we renew our commitment to skill, upskill and reskill for life - grooming youth to face any challenges head-on!

Happy Gurupurnima day My dear Associates.
13/07/2022

Happy Gurupurnima day My dear Associates.

Address

S307, SVSS Nivas, CZECH Colony
Hyderabad
500018

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when TriCAD Design Consultants Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TriCAD Design Consultants Pvt Ltd:

Share