24/06/2020
#ల్యారీ_ఎలిసన్: ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల లిస్ట్ విడుదల చేసినప్పుడల్లా నేను వెతికే పేరు "ల్యారీ ఎలిసన్". టాప్ 10 లిస్ట్ లోకి కొందరు వస్తున్నారు, ఇంకొందరు పోతున్నారు. కానీ ప్రతి సారీ 2000 సంవత్సరం నుంచి టాప్ 10 లో ఉండే వ్యక్తి ఒరాకిల్ అధినేత, 75 యేండ్ల యువకుడు ల్యారీ ఎలిసన్ (లారెన్స్ జోసఫ్ ఎలిసన్).
న్యూయార్క్ లో పుట్టిన ఎలిసన్ కి చిన్నప్పుడే న్యుమోనియా వచ్చింది. తల్లితండ్రులకి అలాంటి కొడుకు ఇష్టం లేక చికాగో లో ఉన్న ఒకరికి దత్తత ఇచ్చారు.
దత్తత తీసుకున్న తల్లి ప్రేమగా పెంచింది, మంచిగా చదివించింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగో లో టాపర్ ఎలిసన్. ఫైనల్ ఇయర్ లో ఉండగా పెంచిన తల్లి చనిపోతే భరించలేక ఒక షర్ట్, ఒక జీన్స్, రెండు టీ షర్ట్స్ కార్ లో వేసుకొని క్యాలిఫోర్నియా డ్రైవ్ చేసుకుంటూ పోయి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకొని పరిచయం అయిన అమ్మాయి ని పెళ్ళి చేసుకున్నాడు. పార్ట్ టైం ప్రోగ్రామర్ గా పనిచేస్తూ మిగతా సమయం రివర్ గైడ్ గా, మౌంటెన్ ట్రెక్కింగ్ చేసే వారికి గైడ్ గా సహాయం చేసేవాడు. జనాలకి దిక్కుమాలిన సహాయాలు చేయకుండా పూర్తి సమయం జాబ్ చేయమని కోరిన పెండ్లం మాట వినలేదని ఆమె విడాకులు ఇచ్చింది.
ల్యారీ కి తను చేస్తున్న ప్రొగ్రామింగ్ జాబ్ నచ్చక తనే ఒక కొత్త డేటా బేస్ కనిపెట్టి "ఒరాకిల్ కంపనీ" స్థాపించాడు. స్టీవ్ జాబ్స్ లాంటివారికి కూడా ల్యారీ ఎలిసన్ రోల్ మోడల్. ఎంత బిజీ గా ఉన్నా తనే మేనేజర్స్ ని ఇంటర్వూ చేసి తీసుకుంటాడు. నైపుణ్యం ఉన్న వ్యక్తులు కంపనీ లో ఉంటే ఆటోమ్యాటిక్ గా కంపనీ అభివ్రుద్ది చెందుతుంది అనేది ల్యారీ విశ్వాసం.
"నీకు నచ్చిన పని చెయ్యి. అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించకు. నీకు నచ్చిన పని చేస్తుంటే నీవు విజయం సాధించినట్లే" అంటాడు ల్యారీ ఎలిసన్. Larry Ellison is One of my all time role models. Great respect 🙏🙏🙏