31/10/2025
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకాల అంబాసిడర్!
అమరావతి: మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ఉపయోగించిన పాత '393' అంబాసిడర్ కారు మళ్లీ వార్తల్లో నిలిచింది!
పార్టీ కార్యాలయంలో ఈ కారును పరిశీలించిన సీఎం, దానితో ఉన్న తన అనుబంధాన్ని, పర్యటనల స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా విస్తృతంగా పర్యటించినప్పుడు ఈ 393 నెంబర్ అంబాసిడర్ కారు సీబీఎన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
ఇకపై ఈ కారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అపురూపంగా ఉంచబడుతుంది. ముఖ్యమంత్రి తన సొంత వాహనమైన పాత అంబాసిడర్‌ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది!
..