16/06/2026
*సిద్దిపేటలోని విపంచి కళ నిలయంలో*
*ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన యువతకు సన్మాన సభలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి*
*సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఏర్పాటు చేసిన సన్మాన, అభినందన సభకు వంగ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.*
ఈ సందర్భంగా ఆర్మీలో ఎంపికైన యువతను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ సేవకు అంకితమై భారత సైన్యంలో చేరడం ఎంతో గర్వకారణమని అన్నారు. యువత దేశభక్తితో పాటు క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన యువకులు మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ యువతకు అందిస్తున్న శిక్షణ, ప్రోత్సాహం అభినందనీయమని పేర్కొంటూ, గ్రామీణ ప్రాంతాల యువతకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శాలువాలు కప్పి, ఘనంగా సన్మానించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు .
ఈ కార్యక్రమంలో సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ప్రతినిధులు, ఆర్మీలో ఎంపికైన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, యువకులు మరియు పలువురు పాల్గొన్నారు.